తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం రామసింగవరం పంచాయతీ పరిధిలోని గొడుగుపేట గ్రామంలో రూ. 1 కోటి 8 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా జేసీబీని నడిపి రహదారి పనుల్లో పాల్గొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.