దేవరపల్లి మండలం దుద్దుకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్య సిబ్బంది పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ శ్రీను హాజరయ్యారు.