తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ప్రాంతం భారీ వర్షాలు, వరద నీటితో జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం గోపాలపురం వెళ్లిన కొవ్వూరు ఆర్టీవో ఆనందరావు అనూహ్యంగా వరదలో చిక్కుకున్నారు. మార్కెట్ యార్డులో ఉన్న సమయంలో ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టడంతో ఆయన అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. మరోవైపు వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, పశువులు సైతం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.