గోపాలపురం మండలం సుబ్బారాయపురం ఎంపీపీ పాఠశాలలో మంగళవారం పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు సజావుగా జరిగాయి. ఈ ఎన్నికల్లో వట్టికూటి శ్రీ పద్మ ఏకగ్రీవంగా ఎస్ఎంసీ చైర్మన్‌గా, కొక్కిరిపాటి శివదుర్గ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను ప్రధానోపాధ్యాయురాలు ఏవీ గౌరీదేవి ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు వెల్లువెత్తాయి.