దుద్దుకూరులో వైయస్సార్ వర్ధంతి వేడుకలు

గోపాలపురం మండలం దుద్దుకూరులో బుధవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ వైసీపీ అధ్యక్షుడు పాపోలు రెడ్డి బాబు ఆధ్వర్యంలో ఎస్సీ పేటలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని, 'జోహార్ వైయస్సార్' అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్