జగ్గంపేట: పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం రాత్రి జగ్గంపేట ఎస్సై టి. రఘునాధరావు తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 20, 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్