అవంతి ఫీడ్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజన్ చోటుచేసుకుంది. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలోని అవంతి ఫీడ్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఫ్యాక్టరీ ఆవరణలోనే క్యాంటిన్ లో ఫుడ్ పాయిజన్ కారణంగా 33 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని యాజమాన్యం దగ్గరలోని జగ్గంపేటలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఎలా ఉంటే ఈ సంఘటనపై సమగ్రత రియాక్ట్ జరపాలని జిల్లా యంత్రాంగం రెవెన్యూ అధికారులను ఆదేశించింది.