అన్నవరం సత్యదేవుని ఆలయంలో గురువారం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రెచ్చిపోయారు. వాడెవడు, అక్షింతలు ఇవ్వలేదని వాడి పెత్తనమేంటి ఇక్కడ, ఓవరాక్షన్, వేషాలు అంటూ ఆలయ అధికారులను ఆయన దూషించారు. ఈవో సుబ్బారావును గుర్తించి ఆయనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అధికారిని ఉద్దేశించి పై తరహాలో దూషణలకు పాల్పడి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.