కోనసీమ వ్యాప్తంగా శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు కురవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. పలు రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షంతో సేద తీరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.