కాకినాడలో భారీ వర్షం

కాకినాడలో సోమవారం భారీ వర్షం పడింది. ఈదురుగాలులతోపాటు కుండపోతగా వాన కురిసింది. కాకినాడ నగరంలో ఏకధాటిగా మూడు గంటలపాటు వర్షం కుంభవృష్టిగా కురిసింది. దీంతో ఉదయం 8. 30 గంటల నుంచి వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్