కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ మనోహర్ బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మనోహర్ ను గుడివాడ కమిషనర్ గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవరిని ప్రభుత్వం నియమించలేదు. మనోహర్ రామచంద్రపురం కమిషనర్ గా పనిచేస్తూ ఏడాది కిందట కాకినాడ కార్పొరేషన్కు డిప్యూటీ కమిషనర్ గా బదిలీపై వచ్చారు.