పెద్దాపురం ఎస్సైగా పాపారావు నియామకం, మౌనిక వీఆర్ కు

పెద్దాపురం పోలీస్ స్టేషన్‌కు కొత్త ఎస్సైగా పాపారావును నియమిస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన తుని ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల పెద్దాపురం మండలంలో మానసిక దివ్యాంగురాలైన మైనర్ బాలికపై లైంగిక దాడి, గర్భస్రావం జరిగిన ఘటనలో కేసు నమోదు చేయకపోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణ నివేదికల ఆధారంగా, ఇంతవరకు పెద్దాపురంలో పనిచేసిన ఎస్సై వి. మౌనికను వీఆర్ కు పంపించి, ఆమె స్థానంలో పాపారావును నియమించారు.

సంబంధిత పోస్ట్