రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరంలో కుండపోతగా వర్షం పడుతుంది. దాదాపు మూడు గంటల నుంచి వాన కురుస్తుంది. అటు విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో సహా పలు చోట్ల తేలికపాటి వానలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు పొలాల్లో, చెట్ల కింద ఉండరాదన్నారు.