పెదపూడి మండలం, పెద్దాడ గ్రామంలో ఇటీవల రైలు ప్రమాదంలో మరణించిన జనసేన పార్టీ కార్యకర్త శిలం వీరబాబు కుటుంబానికి, జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ప్రమాదభీమా చెక్కును అనపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రావాడ నాగు ఆదివారం అందజేశారు. పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకులు పాఠంశెట్టి కాశీరాని, తిరిబిశెట్టి ఆదినారాయణ, ప్రత్తిపాటి వీరభద్రరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.