డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) బుధవారం సర్పవరం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీ గడువు ముగియడానికి ఆరు గంటల ముందు, విచారణకు సహకరించడం లేదని సమాచారం. ఫోన్ పాస్‌వర్డ్ గుర్తులేదని, తన అనుచరులు అభిమానంతోనే సాక్షులను బెదిరించి ఉండొచ్చని పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలిసింది.