గ్రామాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే గోరంట్ల

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం గాడిన పెడుతున్నదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పల్లె పండుగ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు, కాతేరు గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైన్లు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్