ఆలమూరు మండలం మడికి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చొప్పెల్ల గ్రామానికి చెందిన రాయుడు త్రిమూర్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కడియపులంక నర్సరీ పనులకు బైక్‌పై వెళ్తుండగా, ముందు వెళ్తున్న ఇటుకల లోడు ట్రాక్టర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక నుంచి వచ్చిన త్రిమూర్తులు బైక్‌పై నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆలమూరు ఎస్సై నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.