ఆలమూరు: టీడీపీ నేత మృతి.. సంతాపం తెలిపిన పార్టీ శ్రేణులు

ఆలమూరు మండలం సందిపూడి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మండల పరిషత్ ఇన్‌ఛార్జ్ గుత్తుల శ్రీనివాస్ గురువారం అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల మండల టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రమశిక్షణ గల నాయకుడిగా ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్