ఆలమూరు: భర్త ఇంటి ముందు భార్య ధర్నా

అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధింపులకు గురి చేస్తున్నాడంటూ భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ఎదుట శనివారం ధర్నా చేపట్టింది. బాధితుల కథనం ప్రకారం 2020లో రాయవరం మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన సుప్రియను ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామానికి చెందిన పడాల రామారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు లేరనే నెపంతో అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్