ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ జాతీయ స్థాయి ఈత, పడవ పోటీలు ఆదివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాలువ రేవులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా గోదావరి మాతకు పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలు జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.