రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన పోలేరమ్మ సంబరం సమయంలో యువకుల మధ్య ఘర్షణ తలెత్తిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఈ వివాదంలో ఒక వర్గం యువకుడికి తీవ్ర గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు శనివారం దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.