భారీ వర్షాలకు శ్మశానవాటికలు ధ్వంసం.., బయటపడిన అస్థిపంజరాలు

గోపాలపురం మండలంలో మోరసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శ్మశానవాటికలు జలమయమయ్యాయి. ఎగసిపడిన వరద నీటి ఉధృతికి సమాధులు దెబ్బతిని, కొన్ని చోట్ల భూమి కోతకు గురికావడంతో శవపేటికలు, ఎముకలు బయటకు తేలాయి. దీంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దుస్థితిపై అధికారులు స్పందించి శ్మశానవాటికలను తక్షణమే పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕