అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ నుంచి ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న 263 తాబేళ్లను అటవీ శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఆలమూరు మండలం జొన్నాడ వద్ద తనిఖీల్లో ఒక బొలేరో వాహనంలో 12 బస్తాల్లో వీటిని గుర్తించారు. 20 తాబేళ్లు మృతి చెందగా, మిగిలిన వాటిని కాలువలో విడిచిపెట్టారు. నిందితులు పరారయ్యారు, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అమలాపురం ఫారెస్ట్ రేంజర్ ఈశ్వరరావు తెలిపారు.