విద్యుత్ షాక్ కు గురై కంటైనర్ లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన పలివెల, కండ్రిగ రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. కొత్తపేట ఎస్సై జి సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన కమల్ కిషోర్ సాహ్ అనే డ్రైవర్ కంటైనర్ ను రోడ్డు పక్కన నిలిపాడు. లారీ పైన ఉన్న 6. 2 కేవీ విద్యుత్ లైను తగిలి షాక్ కు గురై మృతి చెందినట్లు వివరించాడు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.