కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం కొత్తపేట మండలం అవిడి, ఖండ్రిగల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనలో ఇంటింటికీ అందుతున్న సంక్షేమం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. ఐదేళ్ల వైసిపి పాలనలో విధ్వంసం ఒక్కటే ఉండేదన్నారు.