మడికి ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో ఆకస్మిక మృతి

ఆలమూరు మండలం మడికి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చింతపర్తి గన్నియ్య (51) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఉపాధి శ్రామికుల ఫేస్ యాప్ నమోదు పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. గత 19 ఏళ్లుగా మడికిలో ఉపాధి హామీ పనులను సమర్థంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందిన గన్నియ్య మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల గ్రామస్థులు, తోటి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్