ఎంపీ సానా సతీష్ బాబుకు రావులపాలెంలో ఘన స్వాగతం

రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సానా సతీష్ బాబుకు సోమవారం రావులపాలెం కోనసీమ ముఖద్వారం వద్ద ఘన స్వాగతం లభించింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఆయనకు గజ మాల వేసి, శాలువాతో సత్కరించారు. అమలాపురంలో జరిగే అభినందన సభకు వెళ్తున్న ఎంపీకి కార్యకర్తలు డప్పులు, బాణాసంచా కాల్పులతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్