కొత్తపేటలోని కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన శిశువుకు గురక వస్తుందని కొత్తపేట శివారు కొత్త బస్టాండ్ సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. శిశువుకు సీరియస్ గా ఉందని చెప్పడంతో గురువారం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శిశువును పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించినట్లు తెలిపారు.