కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పేదల పక్షపాతిగా అభివర్ణించారు. గురువారం రావులపాలెంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, 102 మంది లబ్ధిదారులకు రూ. 57,84,809 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన కొనియాడారు.