నిత్యావసరాల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, రావులపాలెం రైతు మార్కెట్ లలో తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని గురువారం బండారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.