కొత్తపేట మండలం వానపల్లిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో శిక్షణ పొందుతున్న ఒడిశాకు చెందిన కుమార్ దిబ్య జ్యోతి (23) కొత్తపేటలోని తన అద్దె ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి వరకు తల్లితో మాట్లాడిన కుమార్, మరుసటి రోజు విధులకు హాజరుకాకపోవడంతో బ్యాంక్ మేనేజర్ ఫ్లాట్ యజమానికి సమాచారం అందించారు. వెళ్లి పరిశీలించగా అతను ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఎస్సై సురేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం తెలిపారు.