దొంగతనం కేసులోఇరువురు యువకులను అరెస్టు చేసినట్లు రావులపాలెంరూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్ తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరులసమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక బ్యాంకు కాలనీలో గత మే నెల 9వ తేదీన వాడపాలెం కు చెందిన బండారు మణికంఠ చింతపల్లి వెంకటరాజు అనే ఇరువురు యువకులు 212 గ్రాములు బంగారం, రెండు కేజీల వెండి, టైటాన్ వాచ్ దొంగిలించినట్లు చెప్పారు.