వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 72 లక్షల ఆదాయం

ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం రికార్డు స్థాయిలో రూ. 72,01,094 ఆదాయం సమకూరింది. ఈ ఒక్క రోజే సుమారు 84,584 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ దర్శన టిక్కెట్లు, ప్రసాదాల విక్రయం, ఆన్‌లైన్ సేవల ద్వారా ఈ ఆదాయం వచ్చింది. అలాగే ఆలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 818 మంది భక్తులకు ప్రాథమిక వైద్య సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్