కొవ్వూరులో నిరూపయోగంగా పార్క్

కొవ్వూరు బ్రిడ్జిపేటలోని అంబేద్కర్ పార్కు నిర్వహణ లేక నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సీనియర్ సిటిజన్లు, చిన్నారులు సేదతీరేందుకు ఈ పార్కును ఆశ్రయిస్తుంటారు.
అయితే ప్రస్తుతం పార్కు ఆవరణలో పిచ్చి మొక్కలు, గడ్డి విపరీతంగా పెరిగి అధ్వానంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో పార్కు ఆవరణ అడవిని తలపిస్తోందని, పార్కును వినియోగించుకోవడం ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాటిని తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ఉపయోగపడేలా పార్కును అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕