తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం, పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ చి. త్రిమూర్తులు పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిమూర్తులుని శాలువాతో సత్కరించి, పంచాయతీ రాజ్ శాఖలో ఆయన అందించిన విశిష్ట సేవలను అభినందించారు. ఉద్యోగ జీవితమంతా నిబద్ధతతో విధులు నిర్వర్తించిన ఆయన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్రిమూర్తులు నిబద్ధత కలిగిన వ్యక్తి అని ఆయన ప్రశంసించారు.