కొవ్వూరు మండలంలో మేజర్ పంచాయతీ అయిన అన్నదేవరపేటలో గాఢాంధకారం నెలకొంది. పట్టించుకునే నాధుడు కరువయ్యాడు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా వీధిలైట్లు వెలగకపోవడంతో బీసీ కాలనీ కొత్త కాలనీ ప్రజలు గాఢాంధకారంలో నివసిస్తున్నారు. అయితే కొత్త కాలనీలో ఉన్న సచివాలయం చుట్టు ఉన్న వీధులలో కూడా లైట్లు వెలగటం లేదు. కనీసం పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు.