తాళ్లపూడి తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తాళ్లపూడి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని గురువారం తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ పరిధిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఆమె పరిశీలించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థకు ప్రజల నుంచి సమస్యలపై వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్