పీ4 కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని దేవరపల్లిలో రూ.1 కోటితో సరికొత్త ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న పేదల్ని ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు సీఎం రూపొందించిన అద్భుతమైన పీ4 కార్యక్రమo అని అన్నారు. దీంతో పరమేశు బయోటెక్ కంపెనీ ఎండి స్పందించి ఆసుపత్రి నిర్మాణానికి కోటి విరాళంగా అందజేశారు.