శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని చాగల్లు మండలంలో బుధవారం, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇతర కూటమి నాయకులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్. శ్రీదేవి, పి.ఆర్.ఏ.ఈ, డిప్యూటీ తాహశీల్దార్ సమక్షంలో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమంలో భాగంగా చాగల్లు గ్రామంలో రూ.8 లక్షల సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం, వరదల కారణంగా కొవ్వాడ కాలువ పొంగి, చాగల్లు మీనానగరం వంతెన వద్ద ముంపునకు గురైన పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత, ఊనగట్ల గ్రామంలో రూ.40 లక్షల సిసి రోడ్డు పనులను, కొత్త లేఅవుట్ మార్గం వద్ద ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్

✕
✕