తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో 'స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఇంటి పెరటి తోటల ద్వారా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకునేందుకు మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చౌటుపల్లి శివ విత్తనాల కొనుగోలు నిమిత్తం రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది సహకారంతో సేకరించిన విత్తనాలను మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన శివను మహిళా సంఘాల సభ్యులు అభినందించారు.