ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు టోల్‌గేట్ సమీపంలోని PHC కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 0 - 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్