కొవ్వూరులోని 13వ వార్డులో ఆదివారం జరిగిన సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు వివరించారు. అలాగే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.