తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని గౌరీపట్నం నిర్మల మేరీ మాత పుణ్యక్షేత్రం వద్ద శుక్రవారం ఎఫ్రాయిము గ్లోబల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. తుపాకులగూడెం గ్రామానికి చెందిన స్వర్గీయ గెడ్డం ఎఫ్రాయిమ్ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బిషప్ గెడ్డం విలియమ్స్, డాక్టర్ బిషప్ గెడ్డం మనస్సే బాబు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చైర్మన్ విలియమ్స్ తెలిపారు.