తూ. గో జిల్లా కొవ్వూరు మండలంలోని ఆరికరేవుల గోదావరి గట్టుపై బుధవారం సాయంత్రం ఓ ట్యాంకర్- ఇసుక లారీ ఢీ కొన్నాయి. గోదావరి గట్టుపై జరిగిన ఈ ప్రమాదం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడుని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.