కొవ్వూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు, టెక్నీషియన్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. దీంతో సుమారు 4 నియోజకవర్గాల పేద ప్రజలు చికిత్స పొందుతారని చెప్పారు.