కొవ్వూరులో పల్స్ పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే ముప్పిడి

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు టోల్‌గేట్ సమీపంలోని పీహెచ్‌సీ కేంద్రంలో ఆదివారం జరిగిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్