ఓం శాంతి నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కొవ్వూరులో సోమవారం బ్రహ్మకుమారీస్ (ఓం శాంతి) నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్యాత్మిక సేవలు, రాజయోగ ధ్యానం ద్వారా సమాజంలో శాంతి, సద్భావన, నైతిక విలువలను పెంపొందించడంలో విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొనియాడారు. నూతన భవనం ద్వారా మరింత మంది ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామ కృష్ణ, కంఠమణి రామకృష్ణ, అర్జిల్లి రామకృష్ణ తదితర NDA నాయకులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్