కొవ్వూరు అర్బన్ I. C. D. S. ప్రాజెక్టు పరిధిలోని యానాదులు కాలనీలో గల అంగన్వాడీ కేంద్రములో సీడీపీఓ వారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అర్బన్ పరిధిలో 30 మంది చిన్న పిల్లలు అంగన్వాడీలో జాయిన్ అయ్యారు. శాసనసభ్యులు చేతుల మీదుగా ఇండక్షన్ స్టవ్, కుక్కర్, వంట గిన్నెలు అంగన్వాడీ వర్కర్స్ కి అందించారు పిల్లలకు ఆట వస్తువులు అందజేశారు.