ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేబిస్ టీకాల కార్యక్రమం

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా మండల పశువైద్యశాల చాగల్లు ఆధ్వర్యంలో పశువైద్యశాల, చాగల్లు ప్రాంగణంలో ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సోమవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 3 నెలల వయస్సు దాటిన 74 కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయబడినవి. మాజీ AMC ఛైర్మన్  ఆళ్ల హరిబాబు,మండల రెవెన్యూ అధికారి (MRO) ఎం. మెరికమ్మ,మండల పశు వైద్యాధికారి డా. యు. ముఖేష్,జి. వెంకటలక్ష్మి, కె. రమ్య, సంజన, శ్రీ పి. హేమంత్, ఎన్. జ్యోతి, కె. శ్రీలత, కె. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్