కొవ్వూరు అభివృద్ధి నిధుల కేటాయింపుకు వినతి

తూ. గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ కు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా కొవ్వూరు మున్సిపాలిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే కుమారదేవంలోని ఏపీఎన్డబ్ల్యూఆర్ జేసీ (APSWRJC) విద్యుదీకరణ పనులను పూర్తి చేసేందుకు సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 7 లక్షలు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్